12-03-2025 10:34:23 PM
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రపుల్ రాంరెడ్డి
ముషీరాబాద్,(విజయక్రాంతి): ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ(టీయూ జేఏసీ) డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి(Telangana Activists JAC Chairman Sultan Yadagiri), సెక్రటరీ జనరల్ ప్రపుల్ రాంరెడ్డి(Telangana Activists' JAC Secretary General Praful Ram Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల జేఏసీ నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ... అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తాము తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. తాము ఉద్యమాలు చేస్తే వాటి ఫలితాలను ఉద్యమ వ్యతిరేకులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. కెసిఆర్ ఉద్యమకారులను అణగదొక్కారని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు బత్తుల సోమన్న, డోలక్ యాదగిరి, కోశాధికారి చంద్రన్న ప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోతి మాధవి రెడ్డి, అధ్యక్షులు వేముల యాదగిరి, కే.రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.