19-03-2025 01:53:27 AM
కొండపాక,మార్చి 18 : ఎన్నికల సమయంలో పెన్షన్ దారులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంగళవారం బి ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆసరా పెన్షన్ ను రూ 5000,రూ 4000లకు పెంచాలని, కార్మికులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అదేవిధంగా అంగన్వాడి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. నెలకు కనీస వేతనం రూ 18000 అమలు చేయాలని అన్నారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిలువేరికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, పలువురు మహిళా బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.