24-03-2025 12:00:00 AM
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాం తి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవే ర్చాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా తమ ఉద్య మం ఆగదని ఆయన హెచ్చరించారు.
బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ సమావేశం జేఏసీ ప్రతినిధి తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రూ.30వేల పెన్షన్, 250 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అదే విధంగా 100 ఎకరాల్లో అమ రవీరుల పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేం ద్రాల్లో ఉద్యమకారుల స్మారక భవనాలను నిర్మించాలన్నారు.
ఉద్యమకారుల సంక్షేమం కోసం నిధులు కేటాయించక పోవడం అత్యంత దారుణమన్నారు. గత పది ఏళ్ల బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరుల కుటుం బాలను ఆదుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డు లు, 25 లక్షల బీమా సౌకర్యం, ఉద్యమకారు ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ప్రధాన కార్యదర్శి బత్తుల సోమన్న, నాయకులు కంచర్ల బద్రి రాజేంద్రప్రసాద్, పెద్ద యాదగిరి, ఆనంద్, క్రిస్టాఫర్, మాధవి, భోగే పద్మ, చంద్రన్న, వెంకటస్వామి, కే. సాయిలు, శంకర్రావు పాల్గొన్నారు.