17-03-2025 02:02:03 AM
మంచిర్యాల, మార్చి 17 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎస్టీయు టీఎస్ జిల్లా అధ్యక్షుడు బట్టారి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నిర్వహించిన రాష్ట్రోపాద్యాయ సంఘం రాష్ట్ర ప్రధమ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
ప్రస్తుత ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని, 317 జీవో ప్రకారం స్పౌస్, పరస్పర బదిలీలు, మార్చిలోపు మిగతా 5 డిఎలు, పి ఆర్ సి లు ఇస్తామని శాసన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పుడు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పడం శోచనీయమన్నారు.
పెండింగ్ బిల్లులు, జిపిఎఫ్ సరెండర్లు, మెడికల్ రియంబెర్సిమెంట్ బిల్లులు, తదితరాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.