calender_icon.png 27 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒట్టు.. ఇది ఎన్టీఆర్ స్టేడియమే!

12-08-2024 12:30:08 AM

  1. మురికి కూపంగా స్టేడియం 
  2. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న వ్యర్థాలు 
  3. నిర్వహణను మరిచిన రాష్ట్ర సాంస్కృతికశాఖ 
  4. పెదవి విరుస్తున్న క్రీడాకారులు 
  5. క్రీడా సాధనకు మైదానం అనుకూలంగా లేదని అసహనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద స్టేడియం (గ్రౌండ్) ఇందిరాపార్క్‌కు ఆనుకుని ఉన్న ఎన్టీయార్ స్టేడియం. స్టేడియం పేరు చెప్పగానే పుస్తక ప్రియులకు బుక్‌ఫెయిర్ గుర్తుకు వస్తుంది. అంతేకాక.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, దోమలగూడ, కవాడిగూడ, ముషీరాబాద్, లోయర్‌ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు క్రీడా సాధనకు, నగరవాసులు వ్యాయామం చేసుకునేందుకు మైదానం ఎంతో ఉపకరిస్తుంది. అలాంటి మైదానం ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ స్టేడియం నిర్వహణను పూర్తిగా మరచిపోయిందని క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భవన నిర్మాణ వ్యర్థాలతో.. 

సువిశాలమైన  ఎన్టీయార్ స్టేడియంలో ప్రతిరోజూ గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి భారీ వాహనాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను డంప్ చేసి వెళ్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున జీహెచ్‌ఎంసీ పారిశధ్య సిబ్బంది హాజరు నమోదు ఎన్టీయా ర్ స్డేడియంలోనే జరుగుతుంది. ఆ తర్వాతే కార్మికులు తమ తమ పనులకు వెళ్తుంటారు. ఆ సమయంలో జీహెచ్ ఎంసీ శానిటేషన్ సూపర్‌వైజర్లు, ఏఎంఓహెచ్‌లు మైదానంలో వ్యర్థాలను చూస్తూనే ఉంటారు. అయినప్పటికీ వ్యర్థాల డంపింగ్‌పై కదలిక రాకపోవడం గమనార్హం.

నగరంలో ఈ నెల 5  నుంచి 9 వరకు జీహెచ్‌ఎంసీ ‘స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్ర మం చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది, కార్మికులు ‘గ్రేటర్’వ్యాప్తంగా శిథిల భవనాలను పడగొట్టారు. ఇతర వ్యర్థాలనూ భారీగా సేకరించారు. ఆ వ్యర్థాలన్నింటినీ జీహెచ్‌ఎంసీ ఎన్టీఆర్ స్టేడియంలోనే డంప్ చేయడం గమనార్హం.

సాంస్కృతిక శాఖ ఏం చేస్తోంది? 

వాస్తవానికి ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణ బాధ్యత రాష్ట్ర సాంస్కృతిక శాఖది. ఆ శాఖ అనుమతితో ఏటా జనవరిలో ఇక్కడ ప్రతిష్ఠాత్మకంగా బుక్ ఫెయిర్ జరుగుతుంది. లక్షలాది మంది పుస్తక ప్రియులు స్టేడియానికి వచ్చి పుస్తకాలు కొంటూ ఉంటారు. ఇది కాక తరచూ అనేక ప్రైవేటు, ప్రభుత్వ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. వ్యాపారపరంగా చేనేత వస్త్ర ప్రదర్శనలు కొన్ని వారాల పాటు కొనసాగుతాయి. వాటి పై అంతో ఇంతో ఆదాయం కూడా వస్తుం ది. అయినప్పటికీ.. సాంస్కృతిక శాఖ స్టేడి యం నిర్వహణను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేడియం గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండేది. నాడు వాచ్‌మెన్లు స్టేడియం వద్ద ఉండి కాప లా కాసేవారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించేవారు కాదు. స్టేడియం సాంస్కృతికశాఖ పరిధిలోకి వెళ్లిన తర్వాత నిర్వహణ అన్న మాటే లేకుండాపోయింది. ఇప్పటికే స్టేడియం చుట్టూ ఉన్న ప్రహరీని కొన్నిచోట్ల కొందరు కూల్చివేశారు. అక్కడి నుంచి చొరబాటు దారులు ప్రవేశించి చెత్తను డంప్ చేస్తున్నారు. స్టేడియంలో పేరుకున్న వ్యర్థాలపై ముషీరాబాద్ సర్కిల్ ఏఎంవోహెచ్ డాక్టర్ మైత్రేయిని వివరణ కోరగా.. రెండు రోజుల్లో ఎన్టీయార్ స్టేడియాన్ని క్లీన్ చేయిస్తామన్నారు. మైదానంలో అక్రమంగా వ్యర్థాలను వదిలేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. 

దుర్వాసనతో క్రీడాకారులకు ఇబ్బందులు

హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్టేడి యం ఉండడం చాలా అరుదైన విషయం. స్టేడియం లో మేం ప్రతిరోజూ క్రికెట్ ఆడు తుంటాం. క్రీడాకా రులంతా ఇక్కడికి వచ్చి సాధన చేస్తారు. కానీ కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తు లు మైదానంలో వ్యర్థాలను వదిలేసి పోతున్నారు. దీంతో మేం ఆడుతున్న దుర్గం ధం వెదజల్లుతోంది. క్రీడాకారులంతా ఇబ్బందులు ఎదు ర్కొంటు న్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించాలి. చెత్తను, భవన నిర్మాణ వ్యర్థాలను డంప్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి.

 రవి, క్రీడాకారుడు, వీఎస్టీ