calender_icon.png 26 February, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డు తిప్పేస్తున్నారు!

26-02-2025 01:40:44 AM

మంథని లో ప్రముఖ బంగారం షాప్ యజమానుల పరార్ 

మొన్న గోదావరిఖని.. నేడు మంథని

మార్చి 6న కూతురు పెళ్లి కోసం  7 తులాల బంగారం ఇచ్చిన ఓ తండ్రి

లబోదిబో మంటున్న బాధిత కుటుంబాలు

మంథని, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మొన్న గోదావరిఖనిలో ప్రముఖ బంగారం షాపు యాజమని రూ. 10 కోట్లతో ఉడాయించాగా, నేడు మంథని లో ప్రముఖ బంగారం షాప్ యజమానులు పరారయ్యారు. ఈ వార్త మంథని పట్టణంలో సంచలనం రేపుతుంది. ఇతర రాష్ట్రానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మంథనిలో గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు. తండ్రితో పాటు కుమారులు రెండు బంగారం షాపులు ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించి, కోట్లు అప్పులు చేసి ఉడాయించినట్లు తెలుస్తుంది.

మంథని పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు తన కూతురు పెళ్లి కోసం ఏడు తులాల బంగా రం ఇవ్వగా ఫోన్ స్వి ఆఫ్ వచ్చింది. దీంతో అన్నదమ్ములకు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు అందరూ ఫోను స్వి ఆఫ్ చేయడంతో వారు పరారైనట్లు ప్రజలు చర్చించు కుంటున్నారు. నాలుగు రోజులుగా సెల్ ఫో న్లు స్వి ఆఫ్ రావడంతో షాపూ తెరవకపోవడంతో  ఎవరికీ కనిపించకుండా పోవడంతో  బాదితులు లబోదిబో మంటున్నారు. ఈ విషయం మంంథని పట్టణమంతా వ్యాపించడంతో అతనికి ఎవరెవరు అప్పిచారు. ఎవరు బంగారం ఇచ్చారు. అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మంథని ఎస్‌ఐ రమేష్ ను (విజయ క్రాంతి) వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.