ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జులై 31(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5 2024 నుంచి 31 జూలై 2024 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడువు పూర్తి కావడంతో బదిలీలపై ఆగస్టు 1 నుంచి నిషేధాన్ని పునరుద్ధరించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రమోషన్లు పొందినవారికి, విదేశీ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి ఈ ఉత్తర్వుల్లో మినహాయింపు ఇచ్చింది. శాఖలవారీగా ఆరు నెలల్లో నిషేధంపై సడలింపు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ కోసం భర్తీచేయాల్సిన ప్రస్తుత ఖాళీలను ఏడాది సర్వీస్‌ను పూర్తిచేసిన వారితో నింపనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.