calender_icon.png 6 April, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కోనసాగింపు

05-04-2025 06:22:56 PM

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం...

కరీంనగర్ (విజయక్రాంతి): సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 30 వరకు పొడిగించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాధులు వస్తున్న నేపధ్యంలో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

మద్యం సేవించి మద్యం ప్రియులు వీధుల్లో, రోడ్లపై అసభ్యపదజాలంతో మాట్లాడుతుడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించింది. మద్యంప్రియుల ఆగడాలకు కళ్ళెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉంది. ఐపిసి 188. హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేదాజ్ఞలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.