20-03-2025 02:18:05 AM
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ది, సంక్షేమంతో పాటు సేవారంగ ప్రగతిశీల బడ్జెట్ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారె డ్డి కొనియాడారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రగతికి బాటలు వేస్తోందని, అన్ని రంగాలకు సమ పాళ్లలో నిధుల కేటయింపు జరిగిందన్నారు.
తలసరి ఆదాయం 1.8 శాతానికి పెరిగిందని, జీఎస్‌డీపీ 10.1 శాతం నమోదు కావడం గొప్ప విషయమన్నారు. ప్యూచర్ సిటీ, మూ సీ సుందరీకరణతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధ్ది చెందడం ఖాయమన్నారు.