దుండగులు గజ్వేల్ నుంచి ఆదిలాబాద్‌కు లారీలో వెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (విజయక్రాంతి): బీదర్ దుండుగులు నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపి తిరుమలగిరి నుంచి శామీర్‌పేటకు ఆటోలో, అక్కడి నుంచి గజ్వేల్‌కు షేర్ ఆటోలో, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్‌కు లారీలో పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు.
వారం రోజుల క్రితం బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు జమచేసే సెక్యూరిటీపై కాల్పులు జరిపి రూ.93 లక్షలతో హైదరాబాద్ నగరానికి పరారై వచ్చిన దొంగలు, అఫ్జల్‌గంజ్‌లోనూ కాల్పులకు తెగబెడ్డ సంగతి తెలిసిందే.
అదేరోజు అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆటోలో వెళ్లినట్టుగా, అక్కడ షాపింగ్ చేసి మళ్లీ ఆటో ఎక్కి తిరుమలగిరి వెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు తిరుమలగిరి నుంచి ఎటు వెళ్లారనే విషయంపై అనేక వీడియోలను పరిశీలించిన పిమ్మట తిరుమలగిరి నుంచి శామీర్‌పేటకు ఆటోలో, అక్కడి నుంచి షేర్ ఆటోలో గజ్వేల్‌కు వెళ్లి, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో వెళ్లినట్టుగా కనుగొన్నారు.
ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీతో పాటు కాల్పులకు పాల్పడిన వారిలో ముందుగా మనీశ్‌ను గుర్తించిన పోలీసులు రెండో వ్యక్తి అమిత్‌గా తేల్చారు. కాగా దుండగులను పట్టుకునేందుకు కర్నాటక పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ కేస్ రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.