calender_icon.png 10 March, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు పురోగతి!

10-03-2025 01:16:16 AM

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం వెలికితీత 

ఇంజినీర్‌గా పనిచేసిన గురుప్రీత్‌సింగ్‌గా గుర్తింపు

మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేత

మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కార్మికుల జాడ 

నాగర్‌కర్నూల్, మార్చి 9 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా రెస్క్యూ బృం దాలు 16 రోజులపాటు తీవ్రంగా శ్రమించి ఆదివారం ఎట్టకేలకు ఒకరి మృతదేహాన్ని వెలికితీశాయి. పంజాబ్‌కు చెందిన రాబిన్సు కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుం బ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. టెన్నెల్‌లోని అదే ప్రాంతంలో మరో ౩ మృతదేహాలు ఉన్నట్లు రెస్క్యూ బృందా లు అనుమానిస్తూ తవ్వకాలు జరుపుతున్నా యి.

13.6 కిలోమీటర్ తర్వాత టీబీఎం మిషన్‌పై భారీగా నీటి ఊట తో కూడిన బండరాళ్లు మట్టి బురద వచ్చి పడటంతో భారీ పొడవైన టీబీఎం మిషన్ పూ ర్తిగా మట్టి లో కూరుకుపోయింది. కాగా ప్రమా ద సమయంలో ఇద్దరు ఇంజనీర్లతో పాటు రాబిన్స్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఆపరేటర్లు మరో నలుగురు కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తీ వ్ర ం గా శ్రమించినట్లు తెలుస్తోంది.

టీ బీఎం అంతర్భాగంలో సేఫ్టీ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి బురద నుం చి తప్పించుకునేందుకు శ్రమించిన ట్లు తెలుస్తోంది. ఒక కార్మికుడి మృ తదేహాన్ని వెలికి తీయడంతో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగిరం చేశాయి. సుమారు 50 మీటర్ల ప్రదేశంలోనే డేంజర్ జోన్‌గా గుర్తించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం రోబో యం త్రాల ద్వారా తవ్వకాలు జరిపేందు కు నిర్ణయం తీసుకుందని అందుకు నిధులు కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కార్మికుల జాడను కనిపెట్టే వీలుందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి.