23-03-2025 12:00:00 AM
గోండ్ కటిరా.. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతారు. ఎండాకాలంలో గోండ్ కటిరా తినడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. దీంట్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సహజంగా నీటిని పీల్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గోండ్ కటిరాతో కలిగే లాభాలేంటో చూద్దాం..
* ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.
*దీన్ని షర్బత్, పాలు, స్వీట్లు, ఆయుర్వేద మందు ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది.
* సంతానోత్పత్తిని పెంచడంలో, హార్మోన్ల సమతుల్యతను సరిచేయడంలో గోండ్ కటిరా బాగా పనిచేస్తుంది.
* దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇది అలసట, బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో వడదెబ్బను నివారించడానికి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి గోండ్ కటిరా ఒక అద్భుతమైన సహజ ఔషధం.
*గోండ్ కటిరా సహజ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా సమ్మర్‌లో కడుపును చల్లబరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరచడంలో, సజావుగా పనిచేయడంలో సహాయపడుతుంది. దీన్ని చల్లటి నీటిలో లేదా పాలల్లో కలిపి తాగితే.. అజీర్తి సమస్య దూరం అవుతుంది.
*ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మంపై చికాకు, మొటిమలు, పొడిబారకుండా కాపాడుతుంది.