calender_icon.png 26 October, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా తగ్గిన పెట్రో కంపెనీల లాభాలు

26-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రభుత్వ రంగ పెట్రో రిఫైనరీ, మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) లాభాలు క్యూ2లో భారీగా తగ్గాయి. రిఫైనింగ్, మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించిన ప్రభావంతో బీపీసీఎల్ కన్సాలిడేటెడ్ నికరలాభం 72 శాతం క్షీణించి రూ.8,243 కోట్ల నుంచి రూ.2,297 కోట్లకు తగ్గింది. రూ.1.17 లక్షల కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదేబాటలో హెచ్‌పీసీఎల్ కన్సాలిడేటెడ్ నికరలాభం 98 శాతం క్షీణించి రూ.5,826 కోట్ల నుంచి రూ. 143 కోట్లకు పడిపోయింది.