calender_icon.png 25 September, 2024 | 6:03 AM

9న లాభాల బోనస్ చెల్లింపు!

25-09-2024 02:11:24 AM

పండుగ అడ్వాన్స్‌గా ఒక్కో కార్మికుడికి రూ.25 వేలు

సింగరేణి సీఎండీ బలరాం

ఈనెల జీతంతోపాటే చెల్లింపు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): వచ్చేనెల 9న కార్మికులకు లాభాల బోనస్ చెల్లించాలని, ఈ నెల జీతంతోపాటు పండుగ అడ్వాన్స్‌గా ఒక్కొక్కరికి రూ.25 వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని సింగరేణి సీఎండీ బలరాం అధికారులను ఆదే శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల బోనస్ వాటాను కార్మికులకు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై సీఎండీ బలరాం మంగళవా రం అమెరికా నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది అధికా రులు, కార్మికులకు లాభాల వాటాను పంపి ణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వారు పనిచేసిన రోజుల సంఖ్యను బట్టి లాభాల వాటా బోనస్‌ను చెల్లిస్తారు. సగటు న ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు అందే అవకాశం ఉంది.

దీనితోపాటు సంస్థ లో పనిచే స్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు 25 వేల మందికి కూడా తొలిసారిగా లాభాల వాటా బోన స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎండీ మాట్లాడుతూ.. ఇందుకు అనుగుణంగా విధివిధా నాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

లాభాల బోనస్‌తోపాటు పండుగ అడ్వాన్సు కింద ఒక్కో ఉద్యోగికి రూ.25 వేల చొప్పున దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.95 కోట్లను కేటాయించినట్టు, ఈ నెల జీతంతోపాటు ఈ అడ్వాన్స్‌ను చెల్లించాలని స్పష్టంచేశారు.

లాభాల బోనస్, పండుగ అడ్వాన్స్‌లు కలిపి దాదాపు రూ.900 కోట్లను సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్న నేపథ్యంలో సిబ్బంది వ్యవహారాలు, ఆర్థిక విభాగాలు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎండీ బలరాం  స్పష్టం చేశారు.