calender_icon.png 15 November, 2024 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కాశీం

15-11-2024 01:33:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కాశీంను నియమిస్తూ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ శేఖర్, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా జీ ప్రభాకర్, టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వీ రమేశ్‌కుమార్, లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఎన్ రామ్ ప్రసాద్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఏవీ రాజశేఖర్, సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కే శైలజ, ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా కే శశికాంత్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమాకమైన ప్రిన్సిపాళ్లను ఓయూ వీసీ గురువారం నియమాక పత్రాలు అందించారు.

ప్రొఫెసర్ కాశీం ప్రయాణం..

ప్రొఫెసర్ కాశీం నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం, అంబట్‌పల్లిలో జన్మించారు. చిన్న వయస్సులోనే పశువుల కాపరిగా పనిచేశారు. తర్వాత రాత్రి బడిలో నాలగో తరగతి వరకు, ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా లింగాల రెసిడెన్షియల్ లో అనభ్యసించారు.

హత్నూర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. హెచ్‌సీయూ నుంచి ఎంఫిల్, ఓయూలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేశారు. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ విద్యార్థి సంఘాన్ని ప్రారంభించి దానికి రాష్ట్ర కన్వీనర్‌గా వ్యవ హరించారు. తనదైన రచనలతో తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానం సాధించారు.