calender_icon.png 5 March, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.11.15 లక్షల చెక్కులు అందజేత

05-03-2025 12:34:16 AM

హనుమకొండ, మార్చి 4 : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం నిర్వహిస్తున్న అడ్తి సభ్యులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్కు అందజేసిన రూ.11.15 లక్షల విలువైన 223 ఫ్రొఫెషన్ టాక్స్ చెక్కులను జీఎస్టీ అధికారులకు అందజేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మంగళవారం అధికారులకు సంబంధిత చెక్కులను అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాష్, కోశాధికారి అల్లే సంపత్, అడ్తి సెక్షన్ అధ్యక్షులు ఎన్రెడ్డి లింగారెడ్డి, చాంబర్ సలహాదారు వెల్ది చక్రధర్ పాల్గొన్నారు.