రామగుండం సీపీ శ్రీనివాసులు
మంచిర్యాల, అక్టోబర్ 30 (విజయక్రాంతి): క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వ హిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. బుధ వారం హాజీపూర్ మండలం గుడిపేట 13వ టీజీఎస్‌పీ బెటాలియన్‌లో బెటాలియన్ కమాం డెంట్ వెంకట రాములుతో కలిసి నిర్వహించి న దర్బార్‌కు ముఖ్య అతిథిగా హాజరై బెటాలియన్ల సమస్యలను తెలుసుకొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, యూనిఫాం లో ఉండి నిరసనలు చేయవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు.
అనంతరం సీపీకి పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు టీజీఎస్పీ డ్యూటీ వల్ల ఎదుర్కొంటున్న వివిధ రకాల ఇబ్బందుల గురించి వివరించారు. వినతులను రిపోర్టు రూపంలో ఉన్నతాధికారులకు పంపుతామని హామి ఇచ్చా రు. కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.