రేపటి నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): గ్రామీణ కళాకారులు ఉత్పత్తి చేసే కళాకృతులను ప్రదర్శించేందుకు శుక్రవారం నుంచి అక్టోబ ర్ 7 వరకు ‘సరస్ మేళా’ను నిర్వహించనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న పీపు ల్స్ ప్లాజాలో ఈ సరస్ మేళాను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.
ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 300 స్వయం సహాయక సంఘాల కళాకారులు పాల్గొ ని, వారు తయారు చేసిన వివిధ హస్తకళలు, చేనేత, సేంద్రియ ఆహార పదార్థాలు, విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తారని వెల్లడించింది. ఈ ఉత్పత్తులను చూడటంతోపాటు కొ నుగోలు చేయడానికి, దేశంలోని గ్రా మీణ కళాకారుల ప్రతిభను ప్రో త్సహించడానికి ప్రజలు ఎక్కువ సంఖ్య లో హాజరు కావాలని వెల్లడించింది.