12-02-2025 06:28:15 PM
సింగరేణి సీఎండి బలరాం..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విదులు నిర్వహిస్తున్న కార్మికులు అధికారులు సూపర్వైజర్లు అంకితభావంతో పనిచేసి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం కోరారు. ఏరియాలోని కేకే 5 గనిని బుదవారం సందర్శించా రు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గనిలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో నూరు శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు, కార్మికులు సమిష్టిగా పనిచేయాలనీ సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 93 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు.
సింగరేణి ఉద్యోగులు కార్మికులు అంకితభావంతో క్రమశిక్షణతో గనిలో పని చేసినప్పుడే పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించగలుగుతామన్నారు. ముఖ్యంగా నూతనంగా విధుల్లో చేరిన డిపెండెంట్లు క్రమశిక్షణతో పనిచేయాలని, గైర్హాజరు లేకుండా చూసుకోవాలని పూర్తిస్థాయిలో పనిచేస్తేనే సంస్థ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాలని సూచించారు. సింగరేణిలో పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ సందర్భంగా సి అండ్ ఎండి బలరాం, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణలను ఏరియా జిఎం, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్, ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, గని మేనేజర్ ప్రవీణ్, ఏరియా అధికారులు కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.