17-04-2025 12:23:55 AM
అధిపతుల సమీక్షా సమావేశంలో జీఎం కృష్ణయ్య
ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో గల జెకె ఓసి, కోయగూడెం ఓసిల్లో ఉత్పత్తి ఉత్పాదకత సకాలంలో పూర్తి చేయాలని అన్ని విభాగాల అధిపతులను జనరల్ మేనేజర్ కృష్ణయ్య ఆదేశించారు. ఇల్లందు ఏరియా లో జే.కే ఓ సి, కోయ గూడెం, నూతన జె కె ఒపెన్ కాస్ట్ కొరకు నిర్వహిస్తున్న పనులకు సంబంధించి బుధవారం యై.సి. ఓ క్లబ్ లో ఏరియా జిఎం వి.కృష్ణయ్య అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ జే.కే ఓ సి, కోయగూడెం ఓసి ల్లో ఉత్పతి, ఉత్పాదకత సకాలం పూర్తి చేయాలి అన్నారు. తరువాత నూతన జెకె ఒపెన్ కాస్ట్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న పర్యావరణ పనులు సకాలంలో పూర్తి చేసి ఉత్పతి, ఉత్పాదకత జరిగేలగా చూడాలి సూచించారు.
ఇప్పటి వరకు నిర్వహించిన పనులకు సంబంధించిన పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యస్ ఓ టు జియం రామస్వామి ఏజీఎం ఐఈడీ గిరిధర్ రావు ఏరియా ఇంజినీరు ఆర్వీ నరసింహరాజు కోయగూడెం పి. ఓ. గోవిందా రావు జెకె. ఓసీ పి. ఓ. కృష్ణ మోహన్ డిజిఎం (పర్సనల్) జీవి. మోహనరావు డీజియం. సివిల్ రవికుమార్ ఇతర అధికారులు పాల్గొనారు.