22-02-2025 04:34:46 PM
టెలి, సినీ దర్శక నిర్మాత నాగబాల సురేష్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎంతో ప్రాచీనం చెందిన శ్రీ బాలేశ్వర స్వామి ఆలయ విశిష్టతను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టెలి, సినీ దర్శక నిర్మాత నాగబాల సురేష్(Television, Film Director and Producer Nagabala Suresh Kumar) అన్నారు. శనివారం ఆలయ ముఖద్వారా నిర్మాణం కోసం వేద పండితులు మధుకర్ శర్మ, నరేష్ శర్మ, శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగబాల సురేష్ కుమార్, శంభు దాస్, వల్లపు అశోక్ దంపతులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ బాల సురేష్ కుమార్ మాట్లాడుతూ... 2500 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ బాలేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భక్తుల కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న బాలేశ్వర స్వామి ఆలయ సమీపము వద్ద యాగశాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆలయముఖ ద్వారా నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన శంభు దాస్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో సుధారాణి, సురేఖ ,సునీత, పద్మ ,రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.