calender_icon.png 4 February, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

04-02-2025 01:36:47 AM

సినిమా ప్రతినిధి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): సౌత్ ఇండి యా ప్రముఖ నిర్మా త కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

గతేడాది డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయనను పట్టుకోవడంతో హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు, తమిళ చిత్రాలను కేపీ చౌదరి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలకు ఆయనడిస్ట్రిబ్యూటర్‌గా వ్య వహరించారు.

అయితే ఇటీవలి కాలంలో కేపీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఈ క్రమంలోనే వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. కేపీ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం అని గతంలో పోలీసులు తెలిపారు.