సికింద్రాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్పా-2 సినిమా రీలిజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో బాలుడు శ్రీతేజ్ గాయపడిన విషయం తెలిసిందే. కాగా, గాయపడి కిమ్స్ హస్పిటల్(Kims Hospital) లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను నిర్మాత బన్నీ వాసు(Producer Bunny Vasu) ఆదివారం పరామర్శించారు. రెండు నెలలుగా కిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్, అతనికి అందుతున్న చికిత్స గురించి బన్నీ వాసు తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్తామని, శ్రీతేజ్ వైద్య ఖర్చులన్ని తామే భరిస్తామని నిర్మాత తెలిపారు.