calender_icon.png 12 January, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలను పిఎసిఎస్ లకే కేటాయించాలి

03-01-2025 06:01:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంసీలకు కాకుండా సింగిల్ విండో కార్యాలయాలకు అప్పగించాలని కోరుతూ పిఎసిఎస్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంల కంటే పిఎసి సంఘాలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయని వారు అదనపు కలెక్టర్ కు విన్నవించారు. పిఎసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచినందున నిర్వహణ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నందున తమకు కేటాయిస్తే నిర్వాహణ ఖర్చులు తగ్గుతాయని అదనపు కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్లు నారాయణరెడ్డి, రఘునందన్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.