calender_icon.png 19 March, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషన్ల పేరుతో కాలయాపనకమిషన్ల పేరుతో కాలయాపన వద్దు!

14-12-2024 12:00:00 AM

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిని ఇస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నాలుగు మాసా లు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదు. కమిషన్ల పేరుమీద కాలయాపన చేయడం వల్ల మాదిగ, -మాదిగ ఉపకులాలు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా దక్కేలా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరపాలి. ఇది అమలయ్యే వరకు ఎలాంటి నియా మకాలు గానీ, నూతన నోటిఫికేషన్లు గానీ ఇవ్వరాదు. ఈ నాలుగు నెలల కాలంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల మాదిగ, -మాదిగ ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి.

ఉమ్మడి రిజర్వేషన్ల ఫలాలు మెజారిటీ ఎస్సీ కులాలు పొందలేదని గతంలో వేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌లు రిపోర్టులు కూడా ఇచ్చాయి. సుప్రీంకోర్టు ధర్మాసనమూ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఆవశ్యకతను తెలుపుతూ తీర్పుద్వారా రాష్ట్రాలకు పలు సూచనలు చేసిందికూడా. గత 30 సంవత్సరాల నుంచి మాదిగ సమాజం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని అలుపెరగని పోరాటం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండు న్యాయబద్ధమైందని, దీనిని ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చునని చెబుతూ అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించాలి.

వెను వెంటనే ‘దేశంలో వర్ణీకరణను అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ’ అని నిండు అసెంబ్లీలో అప్పట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. ‘మాదిగ రచయితల వేదిక -ఇండియా’ ఆధ్వ ర్యంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు ఈ విషయాలు అన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించడం జరిగింది.           

 డా. గోగు శ్యామల, డప్పోల్ల రమేష్