హైదరాబాద్: మొహర్రం పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారీ ఊరేగింపులో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.మొహర్రం సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పటిష్ట భద్రత చేపట్టారు. ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీబీ-కా-ఆలం లేదా బీబీ-కా-అలవా అనేది ముహర్రం సమయంలో జరిగే వార్షిక ఊరేగింపు. ఊరేగింపులో దారిపొడవునా ముస్తింల మాతం నిర్వహించారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, మల్వాలా ప్యాలెస్, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేషా, మీర్ ఆలం మండి, దారుల్‌షిఫా గ్రౌండ్స్, అజా ఖానా జోహ్రా, కాలీ ఖబర్‌లో తొమ్మిది కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగి, చాదర్‌ఘట్‌లో ముగుస్తుంది. ఈ ఊరేగింపు సజావుగా సాగేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయడంతో పాటు శోభాయాత్ర మార్గంలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాని నిర్దేశిత మార్గంలో ప్రమాణం తీసుకున్నప్పుడు ప్రజల రాకపోకలను నివారించేందుకు పోలీసులు మార్గాలను బారికేడ్లను ఏర్పాటు చేశారు.