calender_icon.png 24 October, 2024 | 2:49 AM

హౌసింగ్ రుణాల పేరిట వసూళ్లు?

24-10-2024 12:42:23 AM

  1. బెల్లంపల్లిలో బ్రోకర్ల నయాదందా
  2. లక్షకు పదివేలు వసూలు
  3. పదుల సంఖ్యలో బాధితులు

బెల్లంపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తాము బ్యాంకు ఉద్యోగులమని ప్రజలను నమ్మిస్తూ వ్యవసాయ భూములు, ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలపై  రుణాలు ఇప్పిస్తామం టూ కొందరు వ్యక్తులు అమాయకుల జేబులను గుల్లచేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో ని బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో బ్రోకర్లు గా అవతారమెత్తిన కొందరు రుణాల పేరిట అందినకాడికి దోచుకొని బాధితులకు చిక్కకుండా తిరుగుతున్నారు. తాజాగా సింగరేణి వ్యాపార ప్రాంతమైన బెల్లంపల్లి పట్టణంలో ఈ తరహా నయాదందాకు తెరలేపుతున్నా రు.  తమ అవసరాలకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తారేమోనన్న ఆశతో ప్రజలు ఈ బ్రోకర్ల వలలో పడి మోసపోతున్నారు. 

లక్షకు పదివేలు వసూలు..

వ్యవసాయ భూములు, ఇండ్లకు సంబంధించిన పత్రాలపై జిల్లా కేంద్రంలోని ప్రైవే టు బ్యాంకుల్లో పక్కాగా రుణాలు ఇప్పిస్తామ ని బ్రోకర్లు ఈ ప్రాంతంలో పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. బ్రోకర్లు మొదటగా తాము బ్యాంకులో పని చేస్తున్నట్లు నమ్మిస్తున్నారు.

రుణాల కోసం వీరిని ఆశ్రయించిన వారిని మచ్చిక చేసుకొని పలువురిని బ్యాం కులో రుణం మంజూరు చేసే అధికారులుగా పరిచయం చేస్తున్నారు. బాధితుల ఇంటికి సంబంధించిన పత్రాలు వీరికి ముట్టాక డాక్యుమెంటేషన్ చార్జీల పేరిట రూ. లక్షకు పదివేలు వసూలు చేస్తున్నారు. ఇలా చాలా మంది వద్ద బ్రోకర్లు లక్షల్లో వసూళ్లకు తెగబడ్డారు. బాధితుల నుండి డబ్బులు ముట్టా క పత్తా లేకుండా పోతున్నారు.

రుణాల కోసం బ్రోకర్లకు డబ్బులు చెల్లించిన బాధితు లు నెలల తరబడి ఫోన్లు చేసినా ఎత్తకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఒక్క బెల్లంప ల్లి ప్రాంతంలోనే బ్రోకర్ల చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య పదుల సంఖ్యలో ఉందంటే జిల్లా వ్యాప్తంగా  ఈ నయాదందా ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

పీఎస్‌కు చేరిన కథ..

తాజాగా బెల్లంపల్లిలో ఓ బ్రోకర్ తీరుతో విసిగిపోయిన బాధితుడొకరు బ్రోకర్ల మోసాలపై మంచిర్యాల పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుని నుండి ఫిర్యాదు అందడంతో పోలీసులు బ్రోకర్‌ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు.

బాధితుని వద్ద నుండి రుణాల కోసం డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని, త్వరలోనే ఇంటి పత్రాలు మార్టిగే జ్ చేయించి రుణం ఇప్పిస్తానంటూ సదరు బ్రోకర్ పోలీసుల సమక్షంలో బాధితునితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలీసులు కోల్‌బెల్ట్ పరిసర ప్రాంతాల్లో రహస్యంగా నడుసస్తున్న ఈ నయాదందాపై దృష్టి పెట్టి బ్రోకర్ల చేతిలో అమాయకులు మోసపోకుం డా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తప్పించుకు తిరుగుతున్నాడనే ఫిర్యాదు చేశా ..

బ్యాంకు రుణం కోసం డబ్బులు తీసుకుని పత్తా లేకుండా తప్పించుకు తిరుగుతుండటంతతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా. ముందుగా తన వద్ద నుండి బ్రోకర్ రూ.5వేలు తీసుకున్నా డు. బ్యాంకు అధికారి అంటూ ఒక వ్యక్తి ని పరిచయం చేసి ఇంటికి సంబంధించిన పత్రాలు తీసుకెళ్లాడు.

రుణం ఎప్పు డు మంజూరవుతుందని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే రోజుల తరబడి తప్పిం చుకున్నాడు. తనను మోసం చేశాడని గ్రహించి మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. త్వరలో రుణం ఇప్పిస్తానని బ్రోకర్ పోలీస్‌స్టేషన్‌లో నాకు ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు.

 జీ శేఖర్, బెల్లంపల్లి