వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో కోర్టు మార్గదర్శకాల మేరకు ముందుకు వెళతామని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లా డు తూ.. కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతోందని, ఈ కేసులో ప్రమే యం ఉన్న వారిని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నామన్నారు. ఆధారాలు దొరికితే తర్వాత వారిని సైతం పిలిచి విచారిస్తామన్నారు. ఇప్పటికే తాము దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకున్నదని గుర్తుచేశారు. కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులు జైలులో ఉన్నారని, మరో ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. వాళ్లని కూడా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.