calender_icon.png 16 November, 2024 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పునర్నిర్మాణానికి విధివిధానాలు

04-11-2024 12:30:49 AM

ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం

హుజూరాబాద్, నవంబర్ 3: బీఆర్‌ఎస్ తీరుతో తెలంగాణ అభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరితో జరగలేదని, ప్రజలందరి సహకారంతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలపై పోరాడితే నాటి ముఖ్యమంత్రి నిర్బం ధాలకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజా సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటాలు ఎందుకని ఆయన అన్నారు. గత పదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందన్నారు.

దానిని దారిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని, త్వరలోనే విద్య, వైద్యంపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఎమర్జెన్సీ ఏర్పడిందని, వాటి పునరుద్ధరణ సమయం ఆసన్నమైందన్నారు.

హుజూరాబాద్‌లోని అంబేద్కర్ భవన నిర్మాణంతోపాటు పీవీ జిల్లా సాధనకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ జన సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్‌రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.