calender_icon.png 4 January, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల మంజూరుకు విధివిధానాలు ఖరారు

02-01-2025 12:06:34 AM

  1. 4న క్యాబినెట్ ఎదుట పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు
  2. మంత్రివర్గ ఆమోదం లభిస్తే సంక్రాంతి తరువాత దరఖాస్తులు
  3. ఇప్పటికే మార్పులు చేర్పుల కోసం 10 లక్షల అప్లికేషన్స్  
  4. కార్డుల మంజూరుకు వార్షిక ఆదాయ పరిమితి పెంపు?

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డు ల మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ విధివిధానాలు సిద్ధంచేసింది. ఈ నెల 4న జరి గే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే సంక్రాంతి తరువాత దరఖాస్తులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంది.

గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. మూడు నెలల క్రితం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రేషన్‌కార్డుల మంజూరు విధానంపై అధ్యయనం చేశారు.

వాటిని పూర్తిగా పరిశీలన చేసి కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నట్టు తెలిసింది. పౌరసరఫరాలశాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

పక్క రాష్ట్రాల్లో ఆదాయ పరిమితులు 

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.45 లక్షలు, తమిళనాడులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నూ ఏటా రూ.లక్ష ఆదాయం, గుజరాత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఒకే విధంగా రూ.1.80 లక్షలు, గోవాలో గ్రామీణ ప్రాంతా ల్లో రూ.1.05 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, ఒడిశా గ్రామీణ ప్రాంతంలో రూ.1.25 లక్షలు, పట్టణాల్లో రూ.1.85 లక్షలు, మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేలు, పట్టణవాసులకు రూ.59 వేలు ఉంటే ఆదాయ పరిమితి ఉంటే రేషన్‌కార్డు మంజూ రు చేస్తుంది. 

పెరుగనున్న లబ్ధిదారుల సంఖ్య   

రాష్ర్టంలో ప్రస్తుతం 89.99 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, వీటి ద్వారా 2.82 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మొదట్లో ప్రజాపాలన ద్వారా తీసుకు న్న దరఖాస్తులు ఎక్కువగా రేషన్‌కార్డులకు సంబంధించినవే. కాగా, అందులో 10 లక్షల వరకు రాగా వాటి ద్వారా 30 లక్షల లబ్ధిదారు లు పెరుగుతారని అధికారులు అంచనా వేశా రు. రెండు రోజుల్లో కొత్త కార్డుల మంజూరుపై స్పష్టమైన నిర్ణయం వస్తుందని చెప్పారు. 

రాష్ట్రంలోనూ కొత్త మార్గదర్శకాలు 

తెలంగాణలో రేషన్ కార్డు మంజూరు కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షలు గా ఆదాయ పరిమితులు పెట్టారు. ఈసారి మంజూరు చేసే కార్డులకు ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.80లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.25 లక్షల వరకు పెంచి పౌరసరఫరాల శాఖ నివేదికలో పెట్టినట్టు సమాచారం. భూమి 3.20 ఎకరాలు అర్హత గా ఉండగా, కొత్తగా తరి పొలం 4 ఎకరాలు, మెట్ట 8 ఎకరాలలోపు నిర్ణయించినట్టు ఆ శాఖలోని ఓ అధికారి చెప్పారు.