అనంతగిరి (విజయక్రాంతి): వ్యర్ధాలతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం అమీనాబాద్ ఇందిరమ్మ కాలనీ ప్రధాన రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు తెచ్చిపెడుతుంది. ప్లాస్టిక్ గ్లాసులు ఇతర వ్యర్ధాలను కొందరు దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చి రహదారిపై వేస్తున్నారు. గాలికి అవి రోడ్డుపైకి వచ్చి వాహనాలకు ప్రజలకు తగులుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యక్తంగా మారింది. ఈ రహదారిపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి ఇందిరమ్మ కాలనీకి ఊరి ముఖద్వారం వద్దే వ్యర్ధాలు కనిపిస్తున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పర్చాలని స్థానికులు కోరుతున్నారు.