- శిక్షణ లోపంతో ఎన్యూమరేటర్ల ఇక్కట్లు
- ప్రజల అనుమానాల నివృత్తిలో తడబాటు
- అవగాహనా లోపంతో జనం సహాయ నిరాకరణ
- విస్తృత ప్రచారం చేసినా పట్టించుకోని వైనం
- సైబర్ నేరాల నేపథ్యంలో అప్రమత్తత!
- గడువులోగా సమగ్ర సర్వే పూర్తయ్యేనా?
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలి సిందే. సాధారణంగా ఈ రకమైన సర్వే లో సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, క్షేత్రస్థాయిలో వివరాలు సేక రించడంలోనూ ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
సమ గ్ర కుటుంబ సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు ఇవ్వడానికి కొందరు విముఖత చూపుతున్నారు. దీంతో ఎన్యూమరేటర్ల సమ స్యలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి ఒక్కో ఎన్యూ మరేటర్‌కు 150 కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించాలని కొంత గడువు నిర్దేశించారు. ఈ రకం గా ప్రజల నుంచి సమస్యలు తలెత్తుతుండటంతో వివరాల సేకరణకు నిర్ణీత సమ యం కంటే ఎక్కువగా తీసుకుంటుంది. దీంతోపాటు అసలు వివరాలు ఇవ్వకపోయినా సమస్యగానే మారుతుంది.
శిక్షణ ఇచ్చినా..
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధిం చి ప్రభుత్వం 80 వేలకు పైగా ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాతనే సర్వే ప్రారంభించింది. సర్వేలో భాగంగా వివరాలు సేకరించే క్రమంలో ప్రజలు అడిగే ప్రశ్నలను, సందేహాలను నివృత్తి చేయడంపై కూడా వివరించారు. అయితే, సర్వేలో ఎదురయ్యే సమస్యకు ఎన్యూమరేటర్లు కారణంగా చెప్పాలి.
ఎవరైనా ఇంటికి వచ్చి వివరాలు అడిగితే సందేహం రావడం సాధారణమే. ఈ క్రమంలో కొన్ని చోట్ల ప్రజలకు వచ్చిన సందేహాలను నివృత్తి చేయడంలో ఎన్యూమరేటర్లు విఫలమవుతున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడం తో వివరాలు చెప్పేందుకు వారూ వెనుకాడుతున్నారు. అందులోనూ సర్వే చేసే ఎన్యూమ రేటర్లలో చాలావరకు ఉపాధ్యాయులే ఉన్నా రు.
ఈ నేపథ్యంలో వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు అనే ప్రశ్నల వంటివి ఎదురైన సంద ర్భంగా వారికి సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. అయితే, ఎన్యూమరేటర్ల సర్వే గురించి ప్రజలకు వివరించడంలో విఫలమవుతున్న క్రమంలో ప్రభుత్వం చేపట్టిన శిక్షణలో ఏమైనా లోపం ఉందేమోనని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అవగాహన లేక
రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే ప్రారంభించక ముందు నుంచే ప్రభుత్వం ఆయా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది. అయి నా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించలేక పోయారు. ఈ క్రమంలోనే వివరా లు ఇవ్వడానికి ప్రజలు విముఖత చూపుతున్నారు.
వాస్తవానికి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఏమైనా సమస్యలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే బీసీ కమిషన్ ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ విచారణ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు నేపథ్యంలో సజావుగా సాగుతున్న బీసీ కమిషన్ బహిరంగ విచారణ వాయిదా పడింది.
బహిరంగ విచారణ అలాగే కొనసాగితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తం గా పూర్తయ్యేది. ఇది కూడా ప్రజల్లో సర్వే పట్ల అవగాహన లోపించడానికి కారణమవుతుంది. ప్రభుత్వం ప్రజలకు సరైన అవగాహన కల్పించక ముందే సమ గ్ర కుటుంబ సర్వే ప్రారంభించిందని కొందరు విమర్శిస్తున్నారు.
పార్టీల ప్రమేయమేదీ?
అయితే సర్వేకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేసేవిధంగా వారి కార్యకర్తలకు పిలుపునివ్వాలని ఇప్పటికే అనేక మార్లు పలు బీసీ సంఘాలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నింటికీ విజ్ఞప్తి చేశాయి. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ మినహా మరే పార్టీ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నట్టు కన్పించడం లేదు. స్థానిక నాయకులు సర్వేలో పాల్గొని ఆయా గ్రామాల ప్రజలను చైతన్యం చేసేందుకు అవకాశం ఉంటుం ది.
అయితే, కులగణనను వ్యతిరేకించే పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందు కు రావడం లేదని పలువురు బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. కులగణనకు సంబంధించిన కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినప్పటికీ బీజేపీ, బీఆర్‌ఎస్ తదితర పార్టీలు దీనిపై స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సైబర్ నేరాల నేపథ్యంలో..
కుటుంబ సర్వేలో భాగంగా ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని పోలీస్ శాఖ హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి సర్వే నిర్వహించే అవ కాశం లేదని, సర్వేకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రజలు సర్వేలో భాగం గా వివరాలు సేకరించేందుకు వచ్చిన ఎన్యూమరేటర్లను అనుమానిస్తున్నారని తెలుస్తోంది.
వివరాలు ఇచ్చే క్రమంలో వారి గురించి వాకబు చేయడం మంచిదే అయినా ప్రభుత్వం నిర్వహించే సర్వే కోసం నియమించిన ఎన్యూమరేటర్లను అనుమానించడం సబబు కాదని మరికొందరు చెబుతున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేలా చైతన్య పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకట్రెండు రోజుల్లో పరిష్కారం
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అపోహలున్నాయి. ఆస్తి వివరాలు అడుతున్నారని అనుమానపడుతున్నారు. ఇది కేవలం బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేం దుకు చేసే సర్వే. సైబర్ నేరాల నేపథ్యంలో కూడా ప్రజలు మరింత జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేటర్లతో తలెత్తే సమస్యలను సంబంధిత అధికారులు, సూపర్‌వైజర్ల దృష్టికి తీసుకెళ్తాం.
ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితు లు వేరుగా ఉంటాయి. ఒకటి, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపడుతున్నాం. 18 నుంచి 26వ తేదీ వరకు మళ్లీ బహిరంగ విచారణ చేపడుతాం.
జీనిరంజన్, బీసీ కమిషన్ చైర్మన్
పథకాలు రావనే అపోహలొద్దు
సర్వేలో సేకరించిన వివరాలతో సంక్షే మ పథకాలు రద్దు చేస్తారనే అపోహలొద్దు. సంక్షేమ పథకాలకు, సర్వేకు ఎలాంటి సంబంధం లేదు. కులం చెప్పుకోలేనోళ్లకు కూడా ప్రత్యేక కాలమ్ ఉంది. కులగణన జరగొద్దనే కుట్రలో భాగంగానే కొందరు కావాలనే ఈ రకమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు.
పదేళ్లకోసారి జనగణన జరగడం సహజం. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే సర్వేను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఎన్యూమరేటర్లతో దురుసుగా ప్రవర్తించే తీరు సరికాదు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
జాజుల శ్రీనివాస్‌గౌడ్,
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు