27-03-2025 12:03:12 AM
కూసుమంచి , మార్చి 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు తెచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.. పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉండడంతో మీసేవ , రెవెన్యూ కా ర్యాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు..
ఈ పథకానికి దరఖాస్తు సమయం దగ్గర పడుతుండడం , ఒక్కసారిగా వేల దరఖాస్తులు రావడంతో మీసేవ సర్వర్ నెమ్మదించి సర్టిఫికెట్లు జారీకి ఇబ్బందులు కలుగుతున్నాయి.. మండలం నుండి దాదాపు ప్రతి రోజూ సుమారుగా 100 నుండి 200 మంది దరఖాస్తులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు.. తమకు వచ్చిన దరఖాస్తులను వచ్చినట్టే పరిశీ లించి వెంటనే సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు మండల తహశీల్దార్ కరుణశ్రీ తెలిపారు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో మీసేవ సర్వర్ చాలా స్లో అవుతున్నాయని ఒక్కొక్క దరఖాస్తును అప్లోడ్ చేసేందుకు గంటల సమయం పడుతుంది అన్నారు.. రెవెన్యూ సిబ్బంది కొరత ఉన్నా ఉన్న సిబ్బందితో కూడా పగలు , రాత్రి అనక పని చేస్తూ త్వరగా కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు..
గత మూడు రోజులుగా మీసేవ సర్వర్ నెమ్మదించ డంతో సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందనీ దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు.. ఇప్పటికే సాధ్యమైనంత త్వరగా అందరికీ సర్టిఫికెట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తహశీల్దార్ కరుణశ్రీ తెలిపారు.