కొత్తపల్లి, జనవరి 30: కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలోని ఇందిరానగర్ కాలనిలోని పలు వీధుల్లో మురికి నీటి కాల్వలు మరియు సిసి రోడ్లు లేక గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటి యజమాని స్వంత పైసలతో మురికి నీటి పారుదల సౌకర్యం కోసం పైపులైను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రభు త్వం చేపట్టే పనుల్లో భాగంగా మొదటగా మురికి నీటి కోసం కాలువలు నిర్మించాలని, తర్వాత సిసి రోడ్లు వేయాలి అని ప్రజా సమస్యలను గ్రామ కార్యదర్శి గుర్తించి ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.