calender_icon.png 18 January, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీల్లో సమస్యలు పరిష్కరించాలి

01-07-2024 01:19:59 AM

డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): బస్తీల్లో సమస్యలు పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండీ జావీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్‌పుర్ డివిజన్‌లోని రంగానగర్, క్రాంతినగర్, బోలక్‌పుర్, మజీద్ ఏరియాలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీల్లో గంజాయి సమస్య తీవ్రంగా ఉందని, ఆ మత్తులో పలువురు పోకిరీలు మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్నారన్నారు. బస్తీల్లో పోలీసులు పెట్రోలింగ్ చేయాలని కోరారు. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి మురుగు నీరు చేరుతోందని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్, స్థానిక కార్పొరేటర్‌ను కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు హస్మిబాబు, నాయకులు వేణు, సల్మాన్, బస్తీ నాయకులు ఈశ్వర్, బాబు, కృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.