- టీఎస్ యూటీఎఫ్, గురుకుల జేఏసీ డిమాండ్
- 28న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఈనెల 28న ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, గురుకుల సంఘం జేఏసీ నాయకులు ఎం నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్, గురుకుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 సమస్యలతో చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపొందించి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఆ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈక్రమంలోనే ఈనెల 12న ప్రభుత్వానికి దశల వారీ పోరాట కార్యక్రమానికి నోటీసులిచ్చి రెండు దశల పోరాటం నిర్వహించామని వారు తెలిపారు.