మేయర్ గద్వాల విజయలక్ష్మి...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): బస్తీలు, కాలనీల్లో మౌళిక సదుపాయాల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అధికారులతో కలిసి గురువారం ఆమె భోలక్‌పూర్, బౌద్ద నగర్ డివిజన్లలో పర్యటించారు. ఈ సదర్భంగా శానిటేషన్, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న నాలాలను పరిశీలించారు. భోలక్‌పూర్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, కంది శైలజ, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లు రఘుప్రసాద్, శివ కుమార్ నాయుడు పాల్గొన్నారు.