ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థలో టీమ్స్ డ్రైవర్ల, వైద్య ఆరోగ్యశాఖలోని రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిపో మేనేజర్ విశ్వనాథ్ కు, రెండవ ఏఎన్ఎంల సమస్యలపై రెబ్బెన మెడికల్ అధికారి సుజిత్ కు సోమవారం వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ... ఆర్టీసీ మేనేజర్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.
టీమ్స్ డ్రైవర్లకు పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, టికెట్లు ఇవ్వడంతో పాటు కార్గో, రిజర్వేషన్ చెక్ చేసుకోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రెండవ ఏఎన్ఎంల పోస్టులు పెంచడంతో పాటు 100% గ్రాస్ సాలరీనీ అమలు చేయాలని పెండింగ్ పెండింగ్ లో ఉన్న ఏడు నెలల పిఆర్సి చెల్లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రమీల, వనిత, తులసి, సునీత, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.