27-03-2025 12:00:00 AM
ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ మత్స్యకారులతో బుధవారం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌తో కలిసి సమా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని మత్స్యకారుల సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో పరిష్కరించబడుతున్నాయని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని చెప్పారు.
వృత్తి నైపుణ్య పరీక్షలు చేయని వారికి చేయించి అర్హులైన వారందరికీ మత్స్య సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మత్స్యకారుల లైసెన్స్‌లను రెండు నెలల్లో జారీ చేసి, వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
భవిష్యత్తులో ఎలాంటి స తలెత్తకుండా భూములు కోల్పోయిన గ్రామాలకు న్యా చేస్తామని, ఇతర సమస్యల్ని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వెల్లడించారు.