calender_icon.png 29 December, 2024 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

28-12-2024 08:13:42 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు రోజుల టోకెన్ సమ్మెలో భాగంగా శనివారం రెబ్బెన మండల కేంద్రంలో కార్మికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు కన్నెర్ర చేస్తే పల్లెలు అద్వానంగా మారుతాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి డిమాండ్లను తెలపడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుధాకర్, శంకర్, రమేష్, వెంకటేష్, ప్రవీణ్, దేవాజి, లక్ష్మి, శ్రీనివాస్, రాజేశ్వరి, రాజమ్మ, పద్మ, అన్నాజీ, ధర్మయ్య, ప్రకాష్, మహేందర్, సదాశివ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.