calender_icon.png 25 April, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీలోని సమస్యలు పరిపాలన ద్వారా పూర్తి చేసుకోవాలి

24-04-2025 04:16:40 PM

డిఆర్డిఓ ఎన్ రవి..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మన గ్రామ పంచాయతీ సమస్యలు మనమే గుర్తించి వాటిని పూర్తి చేసుకోవడమే స్థానిక స్వపరిపాలన ఉద్దేశం అని అదనపు డిఆర్డిఓ ఎన్. రవి(DRDO N Ravi) అన్నారు. గురువారం మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామపంచాయతీలో "జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం" పురస్కరించుకొని ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడుతూ... గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత ఉండాలని సూచించారు. గ్రామ సభకు హాజరైన సభ్యుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఓ పోరండ్ల రంగా, కార్యదర్శి సాయిరాం, ఎస్ బి ఎం కన్సల్టెంట్ రేవతి, క్షేత్ర సహాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.