calender_icon.png 16 January, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తా

31-08-2024 02:50:24 PM

గిరిజన గురుకులం రీజనల్ కోఆర్డినేటర్ ఆగస్తేన్ 

తుంగతుర్తి, (విజయక్రాంతి): గిరిజన గురుకులంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని గురుకులం కోఆర్డినేటర్ ఆగస్తేన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం పాఠశాల జరిగిన పరిస్థితులపై తనిఖీకి వచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని బాత్రూంలో కరెంట్ రావడం దురదృష్టకరమని, విద్యార్థులు సేఫ్గా ఉండడం చాలా సంతోషమని అన్నారు.

ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూసుకుంటామని అన్నారు. గత కొంతకాలం నుండి వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం నిజమేనని తక్షణమే ప్రిన్సిపాల్ ది కొటేషన్ వేయించి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎకనామిక్ సబ్జెక్టు టీచర్ ను తక్షణమే నియామకం చేపడుతున్నానని తెలిపారు. పాఠశాల నెలకొన్న సమస్యలను తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అపర్ణ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.