calender_icon.png 1 March, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి

01-03-2025 12:06:30 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 28 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ అందించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. మాన్సూరాబాద్ డివిజన్ చిత్రసీమ కాలనీలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ ను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హాస్టల్ లో మౌలిక, కనీస సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  తనవంతుగా వాటర్ ప్యూరిఫైయర్ ను హాస్టల్ వార్డెన్ కు అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎలాంటి సమస్యలన్నా తన దృష్టికి లేదా బీఆర్‌ఎస్ నాయకుల దృష్టికి తేవాలని సూచించారు.

పరీక్షల మీద శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, సూరజ్ యస్ధాని, విజయ్ భాస్కర్ రెడ్డి, జగదీశ్ గౌడ్, కడమంచి ఆనంద్, హాస్టల్ సిబ్బంది రమేశ్, సంధ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు.