calender_icon.png 23 February, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడ జాగీర్‌లో సమస్యలు పరిష్కరించాలి

13-02-2025 02:01:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో సమ  పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో దోమలు, కుక్కల బెడద, వీధి లైట్ల సమస్యలు ఉన్నాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

బండ్లగూడ జాగీర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ.. దోమల నివారణకు పిచికారి మందుతో పాటు మిషన్ ద్వారా ఫాగింగ్ చేయాలన్నారు.  ప్రతి కాలనీలలో కుక్కల సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరారు.

ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు కబ్జాకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాముడు యాదవ్, బీసీ సంఘం నాయకులు చందు గౌడు, బీర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవికుమార్, చందర్రావు, శాంతి నాయక్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.