calender_icon.png 25 March, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి...

22-03-2025 08:15:04 PM

మార్చి 25న తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాని విజయవంతం చేయండి..

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..

మునుగోడు (విజయక్రాంతి): ప్రజా పాలన పేరుతో ప్రజాసంస్థలను విస్మరించి పాలిస్తున్న పాలకులు గ్రామాలలో స్పెషల్ అధికారుల పాలనతో గ్రామాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ప్రజలను వెంటాడుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీల పదవి కాలం ముగిసి సంవత్సరం గడుస్తున్న గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో గ్రామ కార్యదర్శి లు కనీస వసతులను ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

సంవత్సరాల తరబడి రేషన్ కార్డ్, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ కోసం పథకం కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు కోసం ఈనెల 25న తాహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు మండలంలోని ప్రతి గ్రామం నుండి వందలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, కట్టాలింగస్వామి, దొండ వెంకన్న, గోసుకొండ, రాములు, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటేపాక అయోధ్య తదితరులు ఉన్నారు.