calender_icon.png 1 March, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా లోకో పైలట్ల సమస్యలు

01-03-2025 12:00:00 AM

భారతీయ రైల్వేలో దాదాపు 2,000 మంది మహిళా లోకో పైలట్లు పని చేస్తున్నారు. భారతీయ రైల్వేలలో లోకో పైలట్లు రైలు ఇంజిన్ల లోపల టాయిలెట్ సౌకర్యాలు లేకుండా 12- గంటలు పని చేయాల్సి వస్తుంది. వారు సాధారణంగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

చాలా సంవత్సరాలుగా, లోకో పైలట్లు ఇంజిన్ల లోపల టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ రైల్వేలు 2016లో బయో-టాయిలెట్లతో అమర్చిన లోకోమోటివ్‌లను ప్రవేశపెట్టాయి. అప్పటి నుంచి 8 సంవత్సరాలకు పైగా గడిచినా లోకోమోటివ్‌లలో కొద్దిభాగమే టాయిలెట్లను కలిగి ఉన్నాయి.

కొన్ని సందర్భాల్లో, ఈ పని కారణంగా మహిళలకు గాయాలు, గర్భస్రావాలకూ గురవుతున్నారు. ఆరోగ్యం మహిళ ఉద్యోగుల ప్రాథమిక హక్కు. రైల్వేశాఖ అధికారులు వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి.

ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్