calender_icon.png 21 January, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌టీఎల్ నిర్ధారణతోనే సమస్యల పరిష్కారం

21-01-2025 12:57:51 AM

  1. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  2. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఓఆర్‌ఆర్ పరిధిలో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తయితే ఆక్రమణలకు సం  సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఉద  11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిర్వహించిన ప్రజావాణిలో రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయి. అమీన్‌పూర్ చుట్టూ కబ్జాలపై కూడా అనేక ఫిర్యాదులు అందా  అలాగే నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని 45 ఎకరాల మేడికుంట చెరువు కబ్జాలతో కుంచించుకుపోయిందని స్థానికంగా ఉండే వృద్ధ దంపతులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి గూగుల్ మ్యాప్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఇమేజీలను రంగనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి వాస్తవాలను వాకబు చేశారు.  ఆ  ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు..   

రోడ్డు ఆక్రమించి చర్చి నిర్మాణం... 

గుట్టల బేగంపేట సర్వే నంబర్ 32లోగల ప్లాట్ నంబర్ 85 యాజమాని రోడ్డును ఆక్రమించి చర్చి నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సైబర్‌హిల్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఆ ప్లాటు వాస్తవంగా 276 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటే అక్కడే ఉన్న రోడ్డుకు సం  124 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేశారని పేర్కొన్నారు.

రోడ్డు నిర్మాణం సమయంలో షెడ్డును తొలగించుకోవాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ సదరు వ్యక్తి ప్రస్తుతం అదే రోడ్డు స్థలంలోనే శాశ్వతంగా చర్చి నిర్మాణం చేపడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా..2016లో నిర్వహించిన సర్వే ప్రకారం ఆ ప్లాట్ బఫర్‌జోన్‌లో వస్తుందన్నారు. ఈవిషయమై తగు చర్యలు తీసు   సొసైటీ ఉపాధ్యక్షుడు లింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.