ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం జిల్లా కేంద్రంలో కళాశాల మైదానం , బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియంవాకర్స్ తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టబద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మడి నాలుగు జిల్లాలలో పర్యటించడం జరిగిందని,
చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.తన పర్యటనలో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటి పరిష్కరిస్తామన్నారు.పట్టభద్రులకు ప్రశ్నించే గొంతులు అవసరం లేదని సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాలన్నారు.
విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ యాజమాన్య కళాశాల ప్రతినిధి ఊటుకూరు రవీందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా వీఎన్నార్ టీం ఇంచార్జ్ మాసం రత్నాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, గోలి వెంకటరమణ, వేల్పుల తిరుపతిరెడ్డి, విఎన్‌ఆర్ టీం సభ్యులు సభ్యులు ఆనందం, కనపర్తి జగదీశ్వర్, తోపుల శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, రాజు, మల్లేశం, మడుపు ప్రవీణ్ రెడ్డి, యేసు రత్నం, గోనె ఎల్లప్ప, కల్లూరు చందనలు ఉన్నారు.