మాజీ మంత్రి రామన్న...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఐక్యంగా ఉండి పోరాడితే ఎంతటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న(BRS Party District President Jogu Ramanna) అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) అనేక కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. స్థానికంగా శుక్రవారం నిర్వహించిన ఏఐటీయూసీ(AITUC) అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు. ఐక్యంగా ఉంటూ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏసురత్నం, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, నాయకులు రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.