31-03-2025 12:11:43 AM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసిన మార్నింగ్ వాకర్స్
ఎల్బీనగర్, మార్చి 30 : ఆటోనగర్ లోని మహావీర్ హరిణ వనస్థలి డీర్ పార్కులో సమస్యలు పరిష్కరించి, సదుపాయాలు కల్పించాలని మార్నింగ్ వాక ర్స్ కోరారు. వాకర్స్ అసియేషన్ సభ్యులు ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు వివరించారు. పార్కులో ఓపెన్ జిమ్, యోగా షెడ్, వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఏర్పాటు చేయలని కోరారు. డీర్ పార్కులో ప్రతిరోజు ఉదయం దాదాపు 500 మంది వాకింగ్ చేస్తారని, ప్రజా అవసరాల దృష్ట్యా వసతులు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. డీర్ పార్కులో మీరు అడిగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో పార్కుకు వస్తానని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసియేషన్ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యోగా సాధన అధ్యక్షుడు లింగారెడ్డి, గుత్తా లక్ష్మారెడ్డి, సునీల్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.